Viral Video : సెల్ఫీ కోసం విన్యాసాలు.. రైల్లోంచి పడిపోయిన యువతి

ఎన్ని ప్రమాదాలు జరుగుతున్న యువతకు ప్రమాదకర సెల్ఫీలు(Selfies), రీల్స్(Reels) పిచ్చి వదలడం లేదు.

Update: 2024-12-12 15:36 GMT
Viral Video : సెల్ఫీ కోసం విన్యాసాలు.. రైల్లోంచి పడిపోయిన యువతి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఎన్ని ప్రమాదాలు జరుగుతున్న యువతకు ప్రమాదకర సెల్ఫీలు(Selfies), రీల్స్(Reels) పిచ్చి వదలడం లేదు. ఇక రీల్స్, సెల్ఫీల కోసం ప్రాణాలు కోల్పోయిన వారు కోకొల్లలు. తాజాగా చైనా(China)కు చెందిన యువతి శ్రీలంక(Srilanka)లో అలాంటి విన్యాసాలు చేస్తూ.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడింది. శ్రీలంక పర్యటనలో రైల్లో ప్రయాణిస్తూ.. బోగీ తలుపు వద్ద ప్రమాదకరంగా నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టాల పక్కన ఉన్న చెట్ల కొమ్మలు బలంగా తాకి రైల్లోంచి పడిపోయింది. దీనిని గమనించిన యువతి ఫ్రెండ్స్.. అత్యవసరంగా రైలు ఆగేలా చేసి.. ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. స్వల్ప గాయాలు మినహా ఏమీ కాకపోవడంతో బతుకు జీవుడా అని దేవుడికి దండం పెట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి.. ఇంకోసారి ఇలాంటివి చేయకూడదని హెచ్చరించారు.  

Tags:    

Similar News