‘ఈమె కోసమా తాజ్‌మహల్ కట్టించింది’.. సోషల్ మీడియాలో ముంతాజ్ ఫొటోస్‌పై ట్రోల్స్
భారత దేశంలో ఎన్ని పర్యాటక ప్రాంతాలున్నా.. తాజ్‌మహాల్ క్రేజ్ సపరేట్. నిత్యం వేల మంది తాజ్‌మహాల్‌ను సందర్శిస్తారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలో ఎన్ని పర్యాటక ప్రాంతాలున్నా.. తాజ్‌మహాల్ క్రేజ్ సపరేట్. నిత్యం వేల మంది తాజ్‌మహాల్‌ను సందర్శిస్తారు. ముఖ్యంగా ప్రేమికులు, కపుల్స్ ఎక్కువగా వెళ్తుంటారు. దీనిని చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా నిర్మించాడు. 1631వ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండేది.. ఆ సమయంలో షాజహాన్ మూడో భార్య అయిన ముంతాజ్ తన 14వ సంతాన సమయంలో గౌహరా బేగానికి జన్మనిస్తూ మరణించడంతో షాజహాన్ విచారంతో నిండిపోయాడు.
అయితే, ముంతాజ్ కొన ఊపిరిలో ఉన్న సమయంలో షాజహాన్‌ను ఒక కోరిక కోరుతుంది. ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తనకోసం నిర్మించమని అడుగుతుంది. దీంతో షాజహాన్ తన భార్య కోరికను అంగీకరించి 1632వ సంవత్సరంలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే, ప్రస్తుతం షాజహాన్, ముంతాజ్‌లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంతాజ్‌ను చూసిన నెటిజన్లంతా ‘ఈమె కోసమా? అంత పెద్ద నిర్మాణం కట్టింది’ అని కామెంట్లు పెడుతున్నారు.
కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలకు ముంతాజ్ బేగానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ ఫొటోలు ముంతాజ్ బేగానికి కావు. కొందరు తప్పుగా ముంతా.జ్ బేగానివి అని షేర్ చేస్తున్న పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో ఉన్న మహిళల పేర్లు సుల్తాన్ షాజహాన్ బేగం మరియు బేగం సుల్తాన్ జహాన్. వారు భోపాల్ నగరాన్ని పాలించిన మూడవ బేగం మరియు నాలుగవ బేగం. వారి ఫొటోలను షాజహాన్ భార్య ముంతాజ్‌గా.. ఈమె ప్రేమకు గుర్తుగానే తాజ్ మహల్ కట్టించాడని వైరల్ చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి చెందిన అధికారిక పోర్టల్ https://indianculture.gov.in/ లో భోపాల్‌ను పాలించిన బేగంల గురించి ఉన్నదని, ఆ ఫొటోలు కూడా దాంట్లో పొందుపరిచి ఉన్నాయి. వీరిలో షా జహాన్ బేగం 1838 నుంచి 1901 వరకు, సుల్తాన్ జహాన్ బేగం 1858 నుచి 1930 వరకు భోపాల్‌ను పాలించినట్లు ఆ వైబ్ సైట్ తెలిపింది.