ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. 150 లోయలో పడిపోయిన యువతి
ప్రకృతి అందాలను తిలకించేందు వెళ్లిన ఓ యువతి.. సెల్ఫీ సరదా ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. వి
దిశ, వెబ్‌డెస్క్: ప్రకృతి అందాలను తిలకించేందు వెళ్లిన ఓ యువతి.. సెల్ఫీ సరదా ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర - సతారా జిల్లా బోర్నె ఘాట్‌కు పలువురు స్నేహితులు సరదాగా ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. అక్కడే ఓ యువతి.. లోయ అంచుని నిల్చుని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కాలుజారి పోయి ఆ యువతి 150 అడుగుల లోయలో పడిపోయింది. వెంటనే తోటి స్నేహితులు అక్కడే ఉన్న సేఫ్టీ బృందానికి సమాచారం అందించారు. హూటాహుటిన లోయ వద్దకు చేరుకున్న సేఫ్టీ బృందం లోయలో పడిన యువతి ప్రాణాలతో ఉందని గమనించి.. వారి ప్రాణాలకు తెగించి లోయ నుంచి బయటకు తీసుకొచ్చారు. కాగా తీవ్ర గాయాలు అయిన యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.అలాగే 150 లోతు లోయలో పడిపోయిన యువతిని తన ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన వ్యక్తి పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.