ఓర్ని ఇదేం విడ్డూరం.. ఈ గ్రామంలో పెళ్ళైన వధువు వారం రోజుల పాటు డ్రెస్సే వేసుకోదట.. ఎక్కడో కాదు మనదేశంలోనే

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటినుంచి ప్రపంచ నలుమూలల జరుగుతున్న వింతలు, విశేషాలు అన్ని తెలుసుకుంటున్నాము.

Update: 2024-09-21 07:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటినుంచి ప్రపంచ నలుమూలల జరుగుతున్న వింతలు, విశేషాలు అన్ని తెలుసుకుంటున్నాము. కొన్ని కొన్ని సార్లు వాటిని విని మనం ఆశ్చర్యానికి గురి అవుతున్నాము అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. ప్రస్తుతం అలాంటి వార్తనే నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

బేసిక్‌‌గా వివాహ సంప్రదాయాలు ఒక్కో ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వారు కచ్చితంగా తరతరాలుగా వస్తున్న వివాహ సంప్రదాయాలను పాటిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని మణికర్ణలోయలోని పిని గ్రామంలో వివాహానికి సంబంధించి విచిత్రమైన సంప్రదాయం ఉన్నది. అక్కడి ప్రజలు ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా పాటిస్తున్నారట. మరి ఇంతకీ ఆ సంప్రదాయం ఏంటంటే..?పెళ్లి అయిన మొదటి ఐదు రోజుల పాటు వధువు ఎలాంటి దుస్తులు ధరించకూడదట. కేవలం ఉన్నితో చేసిన ఒక బెల్టును మాత్రమే ధరిస్తారట. వధువే కాదండోయ్ వరుడు కూడా కొన్ని నియమాలు పాటించాలట. ఈ ఐదు రోజులు మద్యం సేవించకూడదట. అయితే ఈ ఆచారాలను వధూవరులు ఇద్దరూ పాటించడం వల్ల వారి దాంపత్య జీవితం హాయిగా, సుఖ సంతోషాలతో సాగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. అందుకే ఇక్కడ పెళ్లయిన ప్రతి జంట ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నదట. కాగా ఇలాంటి భిన్న విభిన్నమైన ఆచారాలు మన దేశంలో ఉండటం గమనార్హం.


Similar News