LPG RATES: భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. రేటు ఎంతంటే?

రాబోయే లోక్‌సభ ఎన్నికలు దృష్టి పెట్టుకుని కేంద్రంలో గ్యాస్ ధరలను తగ్గిస్తుందనుకుంటే ఊహించని షాక్ ఇచ్చింది.

Update: 2024-03-01 05:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే లోక్‌సభ ఎన్నికలు దృష్టి పెట్టుకుని కేంద్రంలో గ్యాస్ ధరలను తగ్గిస్తుందనుకుంటే ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మేరకు19 కేజీల ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు దారుణంగా పెంచాయి. అయితే, పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రభుత్వ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలను దాదాపు రూ.25.50 మేర పెంచాయి. ప్రస్తుం పెరిగిన ధరల మేరకు దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,795, కోల్‌కతాలో రూ.1,911, చెన్నైలో రూ.1,960.50, హైదరాబాద్‌లో రూ.2,002గా ఉంది. ఈ సంవత్సరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి. కాగా, 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపెనీలు వెల్లడించాయి. 

Tags:    

Similar News