Kolkata: మెట్రో ట్రైన్ కాదు.. దుర్గాదేవి మండపం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

దేశ వ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Update: 2024-10-08 06:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మెట్రో ట్రైన్ లాంటిదే, కానీ మెట్రో ట్రైన్ కాదు.. దుర్గా దేవి మండపం. దేశ వ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు చాలా చోట్ల పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాటు చేసి అద్భుతమైన విగ్రహాలు నెలకొల్పి, అపూర్వ భక్తి శ్రద్దలతో దుర్గామాతకి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో కొందరు భక్తులు వినూత్నంగా ఆలోచించి విచిత్ర రీతిలో దుర్గాదేవి మండపాలను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాలోని కొందరు దుర్గాదేవి భక్తులు దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాన్ని మెట్రోట్రైన్ పోలి ఉన్నట్లుగా తయారు చేశారు.

దుర్గామాత దర్శనానికి వెళ్లాలంటే ఈ మెట్రో ట్రైన్ నుంచే వెళ్లాలి. ఇందులో అచ్చం మెట్రోలో ఉన్నట్లుగానే సీట్లు.. డిస్‌ప్లే బోర్డులు, గ్రిప్ హ్యాండిల్స్ లాంటివి అన్నీ అమర్చారు. అంతేగాక ట్రైన్ లో మాదిరిగానే అనౌన్స్‌మెంట్లు కూడా ఇస్తున్నారు. ఇందులో నడుచుకుంటూ వెళ్లే భక్తులకు మెట్రోలో ప్రయాణిస్తున్న అనుభూతినిచ్చేలా మండపాన్ని డిజైన్ చేశారు. తీరా లోపలికి వెళ్లి చూస్తే భక్తులకు దుర్గాదేవి దర్శనం ఇస్తుంది. ఈ మండపానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అద్భుతంగా ఉందని, భక్తుల క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు.


Similar News