అసలైన జాతిరత్నం..సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ప్రశ్నకు రాసిన ఆన్సర్ చూస్తే ఫ్యూజ్‌లు అవుట్!
సోషల్ మీడియా వచ్చాక వింతలు,వినోదాలకు కొదవే లేకుండా పోయాయి. మనం ఎన్నో వింతలను సోషల్ మీడియా వేదికగా చూసి నవ్వుకోవడమే కాకుండా, ఆశ్చర్యపోతుంటాము. అంతే కాదు చిన్న పెద్ద తేడా లేకుండా సోషల్ మీడియాలో అలరిస్తుంటారు.
దిశ,వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వచ్చాక వింతలు,వినోదాలకు కొదవే లేకుండా పోయాయి. మనం ఎన్నో వింతలను సోషల్ మీడియా వేదికగా చూసి నవ్వుకోవడమే కాకుండా, ఆశ్చర్యపోతుంటాము. అంతే కాదు చిన్న పెద్ద తేడా లేకుండా సోషల్ మీడియాలో అలరిస్తుంటారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మీమ్స్ ,ఫన్నీ ఫన్నీ మూవ్మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరినీ నవ్విస్తుంటారు. ఇక మరీ ఫన్నీ థింగ్స్ ఏంటంటే ఎగ్జామ్స్‌లో స్టూడెంట్స్ రాసిన ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ తెలియక అలా అని ఏం రాయకుండా ఉండలేక చిత్రవిచిత్రమైన సమాధానాలు రాస్తారు.
అయితే తాజాగా ఒక స్టూడెంట్ ప్రశ్నపత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఒక క్వశ్చన్ పేపర్ లో అడిగిన ప్రశ్నకు ఆ స్టూడెంట్ ఇచ్చిన సమాధానం చూస్తే మీరు షాక్ తినాల్సిందే. ఓ స్టూడెంట్ రాసిన ఆన్సర్ చూసిన నెటిజన్స్, వారెవ్వా..ఇతను కదా అసలైన జాతిరత్నం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ ప్రశ్న ఏంటో చూద్దాం.. క్వశ్చన్ పేపర్ల లో హార్డ్‌వేర్‌కి, సాఫ్ట్‌వేర్‌కి మధ్య తేడా రాయండి అని ఉంది. ఈ ప్రశ్నకు ఓ స్టూడెంట్ తన స్టైల్‌లో జవాబు రాసుకొచ్చాడు.
హార్డ్‌వేర్ అంటే హార్డ్..సాఫ్ట్‌వేర్ అంటే సాఫ్ట్..హార్డ్‌వేర్ అనేది విభిన్నమైనది .. సాఫ్ట్‌వేర్ కూడా డిఫరెంట్ అని రాశాడు. హార్డ్‌వేర్ సాఫ్ట్ కాదట..అలానే సాఫ్ట్‌వేర్ హార్డ్ కాదంట. ఇలా తనకు తోచిన తింగరి సమాధానాలతో పేపర్ అయితే నింపేశాడు.పేపర్ నింపితే మార్కులు వస్తాయి అనుకొని ఏదో రాసి పాస్ మార్కులు కొట్టేద్దాం అనుకున్నాడు. కానీ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ప్రశ్నాపత్రాలు దిద్దేటప్పుడు వాటిని చూసిన టీచర్‌కు మైండ్ బ్లాక్ అయింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.