అలాంటి పరిస్థితుల్లో నేను ఆ వీడియోనే చూస్తా.. ఆసక్తికరంగా ఆనంద్ మహీంద్రా ట్వీట్

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.

Update: 2024-02-26 15:16 GMT

దిశ, ఫీచర్స్: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు ఇంట్రెస్టింగ్ అండ్ ప్రజలకు ఉపయోగపడతాయి అనుకునే వీడియోస్‌ను నెట్టింట షేర్ చేస్తుంటారు. ఆయన ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ కావడంతో పాటు.. ప్రజలను ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే X ఖాతా ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు మహీంద్ర.

ఓ నిర్మాణ కార్మికుడు చాలా ఎత్తైన భవనంపై పని చేస్తున్నాడు. చాలా అడుగుల ఎత్తున్న ఆ భవనం చివర వరకూ వెళ్లాడు కార్మికుడు. ఆ భవనం పై నుంచి చూస్తే చుట్టుపక్కల సగం వరకు సిటీ కనిపిస్తోంది. అలాంటి ప్రదేశంలో అతడు ఏ మాత్రం భయపడకుండా ఎంతో ధైర్యంగా తన పని తాను చేసుకుంటున్నాడు. తన భుజాన ఓ ఇనుప నిర్మాణాన్ని వేసుకుని అడుగు వెడల్పు మాత్రమే ఉన్న ర్యాంపుపై నడిచాడు. అంతే కాకుండా అతడు పట్టుకున్న ఇనుప పరికరాన్ని దాని స్థానంలో పెట్టి వచ్చాడు. అతడు కింద పడిపోకుండా నడుముకు బలమైన తీగలు తగిలించి ఉన్నాయి. ఎంతటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నా అలాంటి ప్రదేశాల్లో పనులు చేయాలంటే గుండెధైర్యం ఎక్కువగా ఉండాలి.

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.. ‘భవన నిర్మాణ కార్మికుడి సోమవారం ఉదయం ఇలా ఉంటుంది. నా పని చాలా సవాలుగా ఉందని నేను భావించినప్పుడల్లా నేను ఈ వీడియోను చూస్తాను’ అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే.. దీని అర్థం ఏంటంటే.. సాధారణంగా ఆదివారం సెలవు తర్వాత సోమవారం డ్యూటికి వెళ్లడం చాలా మందికి పెద్ద సవాల్‌గా ఉంటోంది. ఆఫీస్‌లో వర్క్ ఎంతో కష్టతరంగా అనిపిస్తుంది. కానీ ఓ భవన కార్మికుడు ఇంత కష్టమైన పనిని అంతా ఈజీగా చేస్తు్న్నప్పుడు మనం ఎందుకు మన పనిని మనం నిర్వర్తించలేము అనే ఉద్దేశంతో ఆనంద్ మహీంద్రా అన అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.



Similar News