కవితక్కను ఇలా చూస్తామని అనుకోలేదు! కనిపించని ఆభరణాలు! ఫోటోలు వైరల్

సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-04-09 09:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బనేజా ముందు హాజరుపరిచారు. కవితకు ఈ నెల 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మళ్లీ కవితను తీహార్ జైలుకు ఈడీ అధికారులు తరలించనున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత తాజాగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘బంగారు ఆభరణాలు లేకుండా కవితక్కని ఇలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు, ఏదేమైనా తెలంగాణ పేరును ఈ విధంగా నిలబెడతావని ఊహించలేదు’ అని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తీహార్ జైలుకు వెళ్లిన అన్ని ఫోటోల్లోనూ ఎమ్మెల్సీ కవిత విచారం లేకుండా సంతోషంగానే కనిపించారని మరో నెటిజన్ కామెంట్ చేశారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ కావడం.. తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుల విలువలు తీసిన మొట్టమొదటి మహిళ అని మరో నెటిజన్ విమర్శించారు.

ఆభరణాలు ధరించేందుకు కోర్టు అనుమతి

కాగా, తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత ఆభరణాలు ధరించేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. జైల్లో ఇంటి భోజనంతో పాటు పడుకునేందుకు మంచం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఉంది. వీటితో పాటు పెన్ను, పేపర్లు, మందులు తీసుకెళ్లేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఇటీవల తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News