ఎటూ కదలకుండా లక్షలు గెలుచుకున్న కోడీ
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు(Chicken bets) పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కోడి పందాల్లో క్షణాల్లోనే కొంత మంది లక్షాదికారులుగా మారిపోతుండగా.. కొందరు తమ సంపదను కోల్పోతున్నారు. అయితే ఈ కోడి పందెం లో నిలిచిన కోళ్లలో ఏది నిలబడి ఉంటే ఆ కోడి విజయం సాధిస్తుంది. దీంతో ఆ కోడిపై పందెం కాసిన వారికి రెట్టింపు డబ్బులు వస్తాయి. అయితే ఈ కోడి పందాలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పందెంలో నిలిని నాలుగు పుంజుల్లో ఒకటి ఎటు కదలకుండా ప్రత్యర్థి కోళ్లపై దాడి చేయకుండా నిలబడి.. ఏకంగా లక్షల రూపాయలను గెలుచుకుంది. ఆ వీడియోలొ.. గ్రూప్ కోడి పందాల్లో భాగంగా నాలుగు పుంజులను ఒకేసారి బరిలో ఉంచారు.
దీంతో ఓ మూడు కోళ్లు మాత్రం భీకరంగా ఫైట్ చేయగా.. ఒక కోడి మాత్రం ఎటు కదలకుండా అక్కడే ఉండిపోయింది. మరో పక్కన మూడు కోళ్లు తీవ్రగాయాలతో ఒక్కోక్కటిగా కింద పడిపోయాయి. దీంతో చివరికి ఎటు కదలకుండా నిల్చున్న కోడి విజయం సాధించి.. లక్షలు గెలుచుకొని.. తనపై బెట్ పెట్టినవారికి కాసుల పంట పండించింది.. దీంతో ఆ కోడిపై పోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలవ్వగా.. మెజారిటీ నెటిజన్లు.."గొడవలు జరిగినప్పుడు ఎమ్ చేయకపోవడమే ఉత్తమమైన మార్గం అనడానికి ఇదు నిదర్శనం" అని రాసుకొచ్చారు. మరికొందరు ఫైస్టార్ చాక్లెట్ యాడ్ ను గుర్తు చేశారు.