బతికుండగానే అంత్యక్రియలు.. శవపేటికపై లేచి కూర్చున్న వృద్ధుడు
ఇటీవల కాలంలో చాలా మందికి వింత వింత కోరికలు కలుగుతున్నాయి..
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మందికి వింత వింత కోరికలు కలుగుతున్నాయి. వారి కోరికలను నెరవేర్చుకునేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఒకతను కూడా అలాంటి పనే చేశాడు. తాజాగా, చైనాలో ఓ వృద్ధుడు బ్రతికుండగానే అంత్యక్రియలు చేయించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. చైనాలోని అన్హూయ్ ప్రావిన్స్‌లో పిల్లలకు దూరంగా ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్న జాంగ్ (84) అనే వృద్ధుడు తాను చనిపోతే అంత్యక్రియలు ఎలా జరుగుతాయో అని ఆలోచన వచ్చింది. దీంతో దాన్ని నిజం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే బతికుండగానే స్థానికుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించి శకపేటికపై కూర్చొని ఊరేగాడు. అది చూసిన స్థానికులు ఆశ్చపోయారు. కానీ, జాంగ్ ఉత్సాహం చూసి అందరూ సంతోషపడ్డారు. ప్రస్తుతం ఆ వృద్ధుడికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read..
3 కోట్ల విలువైన లంబోర్ఘిని కారును క్షణాల్లో ధ్వంసం చేసిన యూట్యూబర్ (వీడియో)