ఢిల్లీ పోలీసులకు చిక్కిన ‘స్పైడర్ మ్యాన్ కపుల్’ ‘టైటానిక్’ స్టిల్ తెచ్చిన తంటా!
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంత మంది చిక్కుల్లో పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ద్వారక వీధుల్లో సూపర్‌హీరోల వేశం వేసి స్పైడర్‌మ్యాన్, స్పైడర్ ఉమెన్ వంటి దుస్తులు ధరించి ఓ జంట బైక్‌పై రీల్స్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంత మంది చిక్కుల్లో పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ద్వారక వీధుల్లో సూపర్‌హీరోల వేశం వేసి స్పైడర్‌మ్యాన్, స్పైడర్ ఉమెన్ వంటి దుస్తులు ధరించి ఓ జంట బైక్‌పై రీల్స్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కి.. చేతులు వదిలేసి డ్రైవింగ్ చేస్తూ ‘టైటానిక్’ సినిమాలోని ఐకానిక్ స్టిల్ ఇచ్చారు. అనంతరం వీడియో వైరల్ అయ్యింది. ఇది గమనించిన ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు శుక్రవారం అరెస్ట్ చేశారు. ముఖ్యంగా, ఢిల్లీ పోలీసులు వివరించిన విధంగా “స్పైడర్ మ్యాన్ జంట” నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేశారు.
బైక్ నడిపిన స్పైడర్ మ్యాన్ ఆదిత్య, అతని స్నేహితురాలు అంజలి "స్పైడర్‌మ్యాన్ నజాఫ్‌గఢ్ పార్ట్ 5" పేరుతో బైక్‌పై వెళుతున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను రికార్డ్ చేశారు. వీడియోలో, "స్పైడర్ ఉమన్" మెట్రో స్టేషన్ నుంచి తన స్పైడర్‌మ్యాన్ స్నేహితుడి వద్దకు వెళుతున్నట్లు చూడవచ్చు. వెంటనే స్పైడర్ ఉమెన్ బైక్‌పై ఎక్కి, ఆ జంట ఢిల్లీ వీధుల్లో రైడ్‌కి వెళుతుంది. అయితే, వీడియో వైరల్ అయిన వెంటనే, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, మోటార్ వెహికల్ యాక్ట్ కింద చలాన్ జారీ చేశారు. అయితే, నజఫ్‌గఢ్‌కు చెందిన అదిత్య సూపర్ హీరో వేషధారణతో బహిరంగంగా ఇటువంటి చర్యను చిత్రీకరించడం ఇదే మొదటిసారి కాదు. ఇండియన్ స్పైడీ అఫీషియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా నడుపుతున్నాడు. అక్కడ అతను “స్పైడర్ మ్యాన్” వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు.