Cyber Crimes: డిజిటల్ అరెస్ట్ స్కామర్లకు షాక్ ఇచ్చిన యువకుడు.. వీడియో వైరల్

డిజిటల్ అరెస్ట్(Digital arrest) పేరుతో వీడియో కాల్ చేసిన స్కామర్లకు(Scamers) ఓ యువకుడు షాక్(Shock) ఇచ్చాడు.

Update: 2025-01-20 03:20 GMT
Cyber Crimes: డిజిటల్ అరెస్ట్ స్కామర్లకు షాక్ ఇచ్చిన యువకుడు.. వీడియో వైరల్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: డిజిటల్ అరెస్ట్(Digital arrest) పేరుతో వీడియో కాల్ చేసిన స్కామర్లకు (Scammers) ఓ యువకుడు షాక్(Shock) ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. డిజిటల్ పేరుతో ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసి, అమాయకుల నుంచి అందినకాడికి లాగుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులమని చెప్పి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లకు ఓ వ్యక్తి ఝలక్ ఇచ్చాడు. వీడియో ప్రకారం హర్ష రాజ్ పుత్ అనే వ్యక్తికి వీడియో కాల్(Video Call) వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగా.. పోలీస్ డ్రెస్ లో ఉన్న అవుతల వ్యక్తి మీ పేరుతో పార్సిల్ వచ్చిందని, అందులో మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పాడు.

అంతేగాక మీపై కేసు నమోదు చేశామని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని అన్నాడు. దీంతో ఆ యువకుడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడగగా.. మాకు కొంత డబ్బు పంపించాలని, అది కూడా బ్లాక్ లో కావాలని ఫేక్ పోలీస్(Fake Police) చెప్పాడు. దీంతో ఆ యువకుడు ఇదిగో బ్లాక్ మనీ(Block Money) తీసుకో అంటూ.. ప్యాంట్ జిప్ విప్పి చూపించబోయాడు. షాక్ గురైన స్కామర్.. నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఈ వీడియో స్క్రిప్ట్‌డ్ అని కొందరు అంటుండగా.. మరికొందరు ఏదైనా కానీ ప్రజలకు అవగాహన కల్పించేలా ఉందని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News