Army Jawan : అమ్మకు ఆర్మీ జవాన్ స్వీట్ సర్‌ప్రైజ్! ఎమోషనల్ వీడియో వైరల్
చాలా మంది యువత ఉన్నత చదువులు చదవడానికి, ఉద్యోగాలు చేయడానికి తను ఉన్న ఊరికి, ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: చాలా మంది యువత ఉన్నత చదువులు చదవడానికి, ఉద్యోగాలు చేయడానికి తను ఉన్న ఊరికి, ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. దీంతో వారు తల్లి దండ్రులను, ఊరిని చాలా మిస్ అవుతుంటారు. ఏదైనా పండుగ సెలవులు వచ్చినప్పుడు తమ తల్లిదండ్రులను కలుస్తుంటారు. ముఖ్యంగా ఆర్మీ జవాన్‌కు సేలవులు తక్కువగా ఉంటాయి. వారు ఎప్పుడైనా సేలవుల్లో ఇంటికి వస్తే వారి కుటుంబ సభ్యుల ఆనందం వెలకట్టలేనిది. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట ఓ ఎమోషనల్ వీడియో వైరల్‌గా మారింది.
సెలవుల మీద వచ్చి అమ్మకు ఓ ఆర్మీ జవాన్ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న తన తల్లి వద్దకు మాస్క్, క్యాప్ ధరించి వెళ్లిన జవాన్.. ముందు కస్టమర్ లాగా ఒక బోండా కావాలని మాట్లాడుతాడు. వెంటనే తల్లీ కొబ్బరి బొండం ఇవ్వబోతుండగా జవాన్ మాస్క్ తీసేస్తాడు. దీంతో కొడుకుని చూసిన తల్లి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును చూసి ఆ తల్లి భావోద్వేగానికి గురవుతుంది. వెంటనే జవాన్ తన తల్లిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు వీడియో చూసి ఫిదా అయ్యారు.