తెలియనివారి పెళ్లికెళ్లి భోజనం చేస్తున్నారా.. ఆ సెక్షన్ కింద కేసుతో పాటు జరిమానా?
దిశ, ఫీచర్స్: జీవితంలో పెళ్లి అనేది అద్భుత ఘట్టం. వధూవరుల కుటుంబాలు తమ బడ్జెట్ కు అనుగుణంగా పెళ్లి వేడుకలు ఏర్పాటు చేస్తారు. బంధువులను, ఫ్రెండ్స్ ను పెళ్లికి ఆహ్వానించి.. గౌరవ, మర్యాదలతో పాటు వారికి రుచికరమైన వెరైటీ భోజనాలు అందిస్తారు. ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువగా ఫంక్షన్ హాల్ లోనే జరుపుకుంటున్నారు. కాగా వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన విందుకు కొంతమంది తెలియని వాళ్లు కూడా వస్తుంటారు.
ఫ్రీగా ఫుడ్ లాగించేస్తుంటారు. ఇప్పటి వరకు అలా చేస్తే నడించింది. కానీ ఇప్పుడు తెలియని వాళ్ల పెళ్లిల్లో భోజనాలు చేస్తే శిక్ష తప్పదట. ఎవరికీ దొరక్కపోతే బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ ఎవరికైనా దొరికితే మాత్రం వారపై కేసు నమోదు అయ్యే చాన్స్ ఉంది. ఐపీసీ సెక్షన్ 441 క్రిమినల్ ట్రెస్ పాస్ కింద మీకు 3 నెలల జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా రూ. 500 జరిమానా విధించే అవకాశం ఉందని సోషల్ మీడియాలోని పలువురు జనాలు చర్చించుకుంటున్నారు.