Viral News: ఏడాదికి కోటి మరణాలు.. కారణం ఇదే..!
ప్రస్తుతం వైద్య నిపుణులను కనిపించని ముప్పు కలవరపెడుతోంది.
దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం వైద్య నిపుణులను కనిపించని ముప్పు కలవరపెడుతోంది. రానున్న రోజుల్లో ఏడాదికి మరణాల సంఖ్య కోటికి చేరుకోనుందని నిపుణులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం వైద్య నిపుణులను కలవరపెడుతున్న అంశం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్ అనగా వ్యాధులకు కారణమైయ్యే సూక్ష్మ క్రిములు ఏ ఔషధాకి లొంగకుండా ఆ ఔషధాలను తట్టుకునేలా వాటి నిరోధకతను పెంచుకుంటాయి.
దీని కారణంగా వ్యాధికి గురైన వ్యక్తి మందులు వాడిన ఆ వ్యాధి తగ్గదు. ఇలా రోగకారక క్రిములు బలపడటానికి కారణం మితిమీరిన ఔషదాల వాడకమే అని నిపుణులు చెప్తున్నారు. మనలో చాలామంది చిన్నచిన్న విషయాలకు అంటే, తలనొప్పి, జలుబు ఇలాంటి సాధారణ విషయాలకు కూడా ఔషదాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్లనే ఈ ముప్పు సంభవించనుందని సమాచారం. రానున్న 2050 నాటికి ఈ మరణాల సంఖ్య అమాంతం పెరగనుందని తెలుస్తోంది. కాగా ఏడాదికి ఈ మరణాల సంఖ్య కోటికి చేరనుందని శాస్త్రవేత్తలు వేస్తున్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.