ఫుడ్‌ను ఫోన్ అని పొరపడిన బుడ్డోడు.. క్యూట్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ప్రస్తుత రోజుల్లో ఏడాది నిండని పిల్లలు కూడా ఫోన్ కావాలంటున్నారు.
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో ఏడాది నిండని పిల్లలు కూడా ఫోన్ కావాలంటున్నారు. ఫోన్‌లో కార్టూన్, రైమ్స్ పెట్టి చూపిస్తేనే ఫుడ్ తింటున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్పినట్లు వినాలంటే ఫోన్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా భావిస్తున్నారు. కానీ చిన్న వయసులో స్మార్ట్ ఫోన్ల వాడకం పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, వారి ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ‘ఆనంద్ మహీంద్రా’ నెట్టింట ఓ పోస్ట్ పెట్టారు. ఈ వీడియోలో చిన్న పిల్లోడు ప్లేటులో ఉన్న ఫుడ్‌ను మొబైల్ అనుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఈ వీడియో వీక్షించిన ఆనంద్ మహీంద్ర ‘ఓ నో.. రోటీ, కప్డా ఔర్ మకాన్’ అని కామెంట్ జోడించి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఈ వీడియో జస్ట్ కామెడీ కోసం కాదని.. పిల్లలు స్మార్ట్ ఫోన్లకు ఎంతగా అడక్ట్ అవుతున్నారో బెస్ట్ ఎగ్జామ్ ఫూల్ అని కామెంట్ చేయగా.. మరికొంతమంది బుడ్డోడి స్మార్ట్ మొబైల్ చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు.
Oh no, no, no….It’s true. Our species has irreversibly mutated..It’s now PHONE, and only AFTER that Roti, Kapda aur Makaan…! pic.twitter.com/49PmgGOYDV
— anand mahindra (@anandmahindra) January 20, 2024