నా పనులన్నీ అయిపోయాయి.. రిసెప్షన్‌కు బట్టలు కొనాలంతే సాయి పల్లవి (meme of the day)
యంగ్ బ్యూటీ సాయి పల్లవి నటిగా, డ్యాన్సర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా డాక్టర్ పట్టాను కూడా పొందింది.
దిశ, ఫీచర్స్: యంగ్ బ్యూటీ సాయి పల్లవి నటిగా, డ్యాన్సర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా డాక్టర్ పట్టాను కూడా పొందింది. అయితే ముందుగా డ్యాన్సర్‌గా లైవ్ షోలలో పాల్గొన్న ఆమె.. తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ ఫిదా మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి చిత్రంతోనే ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సాయి పల్లవితో పాటు ఆమె చెల్లి పూజా కన్నన్ కూడా నటి అన్న సంగతి తెలిసిందే. అయితే పూజా ఇటీవల ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో కాబోయే భర్తను పరిచయం చేసింది. అలాగే ఎంగేజ్మెంట్‌కు మెహందీ కూడా వేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా పలు పోస్టులు చేస్తుంది.
అయితే సాయి పల్లవి పెళ్లి కాకుండా ఆమె చెల్లి గుడ్ న్యూస్ చెప్పటంతో నెటిజన్లు పలు రకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా అందులో నాగచైతన్యను కూడా యాడ్ చేసి లవ్ స్టోరీ ఫొటోలు ఉపయోగించారు. ఈ సారి ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే మా నాన్న నాకు పెళ్లి చేస్తా అన్నాడు అని సాయిపల్లవి అనగా.. దానికి నాగచైతన్య అవునా మరి ఎలా ప్రిపేర్ అవుతున్నావ్ అంటాడు. దీంతో సాయి పల్లవి నా పనులన్నీ అయిపోయాయి.. ఒక్క రిసెప్షన్‌కు బట్టలు కొనాలంతే.. అన్నట్లు ఉన్న మీమ్ అందరినీ ఆకట్టుకుంటుంది.