ఇకపై మేకప్ అవసరం లేకుండా టాటూ వేసుకున్న ఓ యువతి.. ఆమె ముఖం ఇప్పుడు ఎలా ఉందంటే..?

ఒకప్పటి వీటిని పచ్చబొట్టు అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని టాటూగా మార్చేసారు.

Update: 2024-07-12 08:45 GMT

దిశ, ఫీచర్స్ : ఒకప్పటి వీటిని పచ్చబొట్టు అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని టాటూగా మార్చేసారు. కొంతమంది శరీరం మొత్తం టాటూస్ ఉంటాయి ఇంకొందరు టాటూ అంటేనే చిరాకు పడతారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఈ టాటూల ట్రెండ్ ఎక్కువగా స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ , క్రికెటర్లల్లో కనిపిస్తోంది. రోజు రోజుకీ వీటికి డిమాండ్ పెరుగుతుంది. టాటూ వేసే వాళ్ళు కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు.

ఇదిఎక్కడైనా వేపించుకోవచ్చు. అయితే కొందరు వింత టాటూలు వేయించుకుని వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఒక యువతి వేపించుకున్న టాటూ హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అదేంటో మీరు కూడా చూసేయండి.

రోజూ మేకప్ వేసి, తీయడం ఎందుకని ఈ యువతి ఏకంగా మేకప్ స్టైల్ లో టాటూని వేయించేసుకుంది. పింక్ కలర్ సిరాను తీసుకెళ్లి ఆమె బుగ్గలపై టాటూలా వేపించుకుంది. ఈ టాటూ వేసిన తర్వాత కొంత సమయం ఆరనిచ్చి.. ముఖం శుభ్రం చేసుకుని చూడగా..మేకప్ వేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాంటి లుక్ కనిపించింది. ఇప్పటికి అనేక మంది ఈ వీడియోను లైక్ చేసారు. ఈ వీడియోపై నెటిజెన్స్ స్పందిస్తూ ‘ అందమైన ముఖాన్ని అనవసరంగా పాడు చేసుకున్నారు..’ ఇంకొకరు ‘డబ్బు ఆదా చేయడం కోసం ఇలా చేయడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News