సింగిల్ వీల్ స్కూటీ.. ఆ వ్యక్తి ఎలా నడుపుతున్నాడో చూడండి..
ఈ మధ్యకాలంలో చాలామంది ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు.. కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు.
దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో చాలామంది ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు.. కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. అంతే కాదు వారు చేసే వింత విన్యాసాలను ఇంటర్నెట్ సాయంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోలు ఒకరి ద్వారా ఒకరికి షేర్ అవుతూ తెగ వైరల్ అవుతాయి. ఇలాంటి వీడియోలు మనం చూడడానికి కారణం కూడా ఇదే. ఇప్పటి వరకు మనం చూడనిది ఓ వింత వీడియో ఇప్పుడు జనాల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు.
మనం మార్కెట్ లో ఎన్నో రకాల స్కూటీలను చూసి, నడిపే ఉంటాం. ఒక్కో స్కూటీ ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని స్కూటీలు స్పోర్టీ లుక్‌తో ఉంటే మరికొన్ని మంచి మైలేజీని ఇస్తాయి. కానీ మనం ఇప్పుడు చూసే స్కూటీ అన్నింటి కన్నా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఒకరి కోసం మాత్రమే తయారు చేసిన స్కూటీ. వింటుంటే చూడాలని ఉంది కదా. దీన్ని చూశాక ఔరా అనక మానరు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి స్కూటర్‌ను నడపడం చూడవచ్చు. ఆ స్కూటర్ అన్నిటిలా కాకుండా ఒకే చక్రంతో ఉంది. దాని సీటు కూడా చాలా చిన్నదిగా ఒకరు మాత్రమే కూర్చునేలా ఉంది. రెండు చక్రాలున్న బండిని నడపడమే కష్టంగా ఉన్న రోజుల్లో ఆ వ్యక్తి సింగిల్ వీల్ స్కూటీని బ్యాలెన్సింగ్ చేస్తూ వింతగా నడిపిస్తున్నాడు.
ఈ వీడియలో ఇన్‌స్టాలో ట్రోల్‌గ్రామోఫీషియల్ అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోని చూసినవారందరూ 'ఒంటరిగా ఉండేవాళ్ల స్కూటర్ వచ్చినట్లుంది' అని ఓ యూజర్ రాస్తే.. 'బ్రదర్.. ఈ కుర్రాడు బండిని బ్యాలెన్స్ చేశాడంటే ఆశ్చర్యంగా ఉంది' అని మరొకరు రాశారు.. అంతే కాకుండా ఇంకా చాలా మంది దీని పై కామెంట్ చేస్తూ తమ స్పందనను తెలియజేశారు.