ఈ వీడియో చూశారంటే జన్మలో వాటిని తినరు..!
కూరగాయల మార్కెట్ కు వెళ్తే టమాట, పచ్చిమిర్చి, కాకరకాయ, దొండకాయ వంటి ఎన్నో కూరగాయలు దర్శనమిస్తుంటాయి.
దిశ, వెబ్ డెస్క్: కూరగాయల మార్కెట్ కు వెళ్తే టమాట, పచ్చిమిర్చి, కాకరకాయ, దొండకాయ వంటి ఎన్నో కూరగాయలు దర్శనమిస్తుంటాయి. ఇక వాటితో పాటే మనకు పాలకూర, గొంగూర, కొత్తిమీర, కరివేపాకు వంటి ఆకు కూరలు కూడా కన్పిస్తాయి. కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నాయో తెలుసుకోవడానికి వాటిని పట్టుకొని పట్టుకొని చెక్ చేయడమో లేక తుంచడమో చేస్తుంటారు. ఇక ఆకు కూరల విషయానికి వస్తే వాటిని చూడగానే అర్థమవుతుంటాయి అవి ఫ్రెషా కాదా అని. వాడిపోకుండా పచ్చగా నిగనిగలాడితే అవి ఫ్రెష్ గా ఉన్నట్లు భావించి కొంటుంటారు. కానీ కంటికి కనబడేదంతా నిజం కాదన్నట్లు అలా కంటికి కనబడే కూరగాయలన్నీ తాజా కూరగాయలు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కూరగాయల వ్యాపారులు వాటిని ఫ్రెష్ గా ఉంచడానికి రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. కాగా తాజాగా కూరగాయల వ్యాపారులు ప్రజలను కెమికల్స్ తో ఏ విధంగా మోసం చేస్తున్నారో చెప్పే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమిత్ తందానీ అనే ఓ వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోలో.. ఓ వ్యక్తి వాడిపోయిన కొత్తమీర కట్టను తీసుకొని కెమికల్ కలిపిన ఓ బకెట్లో ముంచుతాడు. అనంతరం బయటకు తీసి ఓ బాక్స్ పై పెడ్తాడు. అనంతరం ఆ వాడిపోయిన కొత్తిమీర కట్టను దగ్గరగా గమనిస్తే ఆ కొత్తమీర రెమ్మలు నెమ్మదిగా పైకి లేస్తుంటాయి. అలా కొంత సమయం తర్వాత చూస్తే ఆ ఆకుకూర అచ్ఛం అప్పుడే పొలం నుంచి తెంపుకొచ్చిన కొత్తమీరలా ఫ్రెష్ గా మారుతుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు ప్రస్తుతం 5 లక్షలకు పైగా వ్యూస్ రాగా 2 వేల మందికి పైగా కామెంట్ చేశారు. ‘వామ్మో.. మనం రోజూ ఏం తింటున్నామో అర్థం కావడం లేదు. తెలిసిన వాళ్ల దగ్గర కూరగాయలు కొనడం బెటర్’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా..‘‘ఈ కెమికల్స్ వాడటం వల్ల ఎలాంటి అనర్థాలు జరగవు. కూరగాయలు ఫ్రెష్ గా ఉంచడానికే మాత్రమే వీటిని వాడతారు’’ అంటూ కొంతమంది అంటున్నారు. ఇక ‘‘ ఇలాంటివి తినడం వల్లే క్యాన్సర్, ఇతర రోగాలు వస్తున్నాయి’’ అని మరికొంతమంది అంటున్నారు.