పిచ్చి పీక్స్.. -22 డిగ్రీల చలిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్న జంట (వీడియో)

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న వాటిల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి.

Update: 2024-03-22 10:32 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న వాటిల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి. పెళ్లికి ముందుకు వధువరులు ఇద్దరూ కలిసి ఫొటో షూట్ చేయించుకుంటారు. అయితే.. ఈ మధ్య కాలంలో ప్రీ-వెడ్డింగ్ షూట్స్ పేరుతో జరుగుతున్న ఓవరాక్షన్లకు అంతూపొంతూ లేకుండా పోతోంది. ఏదో రకంగా వైరల్ అయ్యేందుకు కొందరూ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది.

ట్రావెలింగ్ వీడియోస్‌తో సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఆర్యా వోరా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుని బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘దేవో కి దేవ్ మహదేవ్’ అనే సీరియల్‌గా కూడా నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది ఆ అమ్మడు. అయితే.. ఈ పిచ్చితోనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది ఆర్యా. ఈ విషాయాన్ని తానే స్వయంగా అభిమానులతో పంచుకుంది.

‘హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్న స్పితి వ్యాలీకి ఎవరైనా వెళ్లారా..? నేను వెళ్లా. అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేశా. కానీ అక్కడ -22 డిగ్రీల విపరీతమైన చలితో నేను స్పృహ కోల్పోయాను. దీంతో నా పక్కన ఉన్న వాళ్లు నాకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఒక్క సారిగా శరీరంలోని ఉష్ణోగ్రత పడిపోయి హైపోథెర్మియాకు గురయ్యాను. దాదాపు మృత్యవుతో పోరాడినంత పనియ్యింది’ అంటూ ఎంతో గర్వంగా ఓ వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది ఆర్యా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.


Similar News