వందల ఏళ్లనాటి చెట్టు.. కొమ్మలు నరికారని ఏడుస్తోంది (వీడియో)
దిశ,వెబ్ డెస్క్:మనుషులు ఏడవడం చూసి ఉంటాం .. జంతువులూ ఏడవడం చూసి ఉంటాం.. కానీ ఎప్పుడైనా చెట్టు ఏడవడం చూసారా? చెట్టు ఏడవడం ఏంటి .. మతి పోయింది అనుకుంటున్నారా ? అయితే మహారాష్ట్ర లో వెలుగుచూసిన ఈ వింత చూడండి. సోలాపూర్ లోని బలివ్స్ ప్రాంతంలో ఒక స్కూల్ ఎదురుగా ఒక చెట్టు వందల ఏళ్ళ క్రితం నుండి ఉంది. అయితే ఈ చెట్టు బాగా పెరిగిపోవడంతో చెట్టు కొమ్మలను స్థానికులు ఇటీవలే నరికివేశారు. అప్పటినుండి […]
దిశ,వెబ్ డెస్క్:మనుషులు ఏడవడం చూసి ఉంటాం .. జంతువులూ ఏడవడం చూసి ఉంటాం.. కానీ ఎప్పుడైనా చెట్టు ఏడవడం చూసారా? చెట్టు ఏడవడం ఏంటి .. మతి పోయింది అనుకుంటున్నారా ? అయితే మహారాష్ట్ర లో వెలుగుచూసిన ఈ వింత చూడండి. సోలాపూర్ లోని బలివ్స్ ప్రాంతంలో ఒక స్కూల్ ఎదురుగా ఒక చెట్టు వందల ఏళ్ళ క్రితం నుండి ఉంది. అయితే ఈ చెట్టు బాగా పెరిగిపోవడంతో చెట్టు కొమ్మలను స్థానికులు ఇటీవలే నరికివేశారు. అప్పటినుండి విచిత్రంగా చెట్టునుండి ధారాపాతంగా నీరు కారడం ప్రారంభమయ్యింది. చెట్టులోపల ఏమైనా నీరు నిలిచి ఉండొచ్చు అందుకే నీరు వస్తుంది అని ముందు స్థానికులు ఈజీ గా తీసుకున్నారు. ఆ నీరు కారడం రోజు రోజుకు పెరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. చెట్టు కొమ్మలు నరికివేయడంతో చెట్టు ఏడుస్తుందని అక్కడివారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
దీంతో ఈ చెట్టును చూడడానికి చుట్టుపక్కల ప్రజలు భారీసంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం ఈ చెట్టు వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే అసలు చెట్టు నుండి నీరు కారడానికి కారణం ఏంటి అని బయాలజీ ప్రొఫెసర్లను ఆరా తీస్తే అది చెట్టుకు ఉన్న ఒక లక్షణమని , చెట్టు కొమ్మలు నరికివేయడంతో కింద నుండి చెట్టు పీల్చుకుంటున్న నీరు అలా బయటికి వస్తుందని తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నీరు కారుతున్న చెట్టు తో ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు.