35మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ..

రాష్ట్ర వ్యాప్తంగా 35మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబరు 86 ప్రకారం 35మంది కమిషనర్లకు స్థాన చలనం కల్పించారు. ఇందులో 19మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన వారిని కూడా బదిలీ చేశారు. పురపాలక మంత్రి కేటీఆర్ ఈ బదిలీల విషయంలో కీలక కసరత్తు చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులతో పాటు… గతంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిళ్లతో ఇతర శాఖల ఉన్నతాధికారులకు ఇన్‌చార్జి […]

Update: 2020-02-18 00:53 GMT

రాష్ట్ర వ్యాప్తంగా 35మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబరు 86 ప్రకారం 35మంది కమిషనర్లకు స్థాన చలనం కల్పించారు. ఇందులో 19మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన వారిని కూడా బదిలీ చేశారు. పురపాలక మంత్రి కేటీఆర్ ఈ బదిలీల విషయంలో కీలక కసరత్తు చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులతో పాటు… గతంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిళ్లతో ఇతర శాఖల ఉన్నతాధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇప్పించిన స్థానాల్లోనూ కొత్తవారిని నియమించారు. ఇటీవలే పురపాలక ఎన్నికలు పూర్తయ్యి కొత్త పాలక వర్గాలు ఏర్పడిన క్రమంలో 35 మున్సిపాలిటీలకు కొత్త కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా అవుతున్నాయి.

Tags:    

Similar News