విద్యుత్ సిబ్బందిని ఆపొద్దు
డీజీపీకి ట్రాన్స్‌కో ఎండీ లేఖ దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లోనూ 24గంటల విద్యుత్ అందించడానికి కృషిచేస్తున్న తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులకు రోడ్లపై ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ట్రాన్స్ కో ఎండీ డి. ప్రభాకర్‌రావు పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం రాష్ట్ర డీజీపీ మహెందర్‌రెడ్డికి లేఖ రాశారు. టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ జెన్‌కో టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు తమ సిబ్బంది విధులకు హాజరవడానికిగాను ఇచ్చిన పాసులను పోలీసులు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. […]
డీజీపీకి ట్రాన్స్‌కో ఎండీ లేఖ
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లోనూ 24గంటల విద్యుత్ అందించడానికి కృషిచేస్తున్న తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులకు రోడ్లపై ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ట్రాన్స్ కో ఎండీ డి. ప్రభాకర్‌రావు పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం రాష్ట్ర డీజీపీ మహెందర్‌రెడ్డికి లేఖ రాశారు. టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ జెన్‌కో టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు తమ సిబ్బంది విధులకు హాజరవడానికిగాను ఇచ్చిన పాసులను పోలీసులు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల పాసులు కలిగి ఉన్న ఉద్యోగులు, ప్రైవేటు కాంట్రాక్టర్లు, కాంట్రాక్టు వర్కర్లను సాఫీగా తిరగనివ్వాలని కోరారు. ఎమర్జెన్సీ సమయంలో విధులు నిర్వహించడానికి వీరి సేవలు తప్పనిసరని తెలిపారు. పలు పనుల నిమిత్తం కాంట్రాక్టు ఏజెన్సీలు, వారి సిబ్బంది మెటీరియల్ తీసుకువెళ్లే వాహనాలను ఆపకుండా సంబంధిత పోలీసు సిబ్బందికి తగిన ఆదేశాలివ్వాలని ప్రభాకర్ రావు డీజీపీని కోరారు.
Tags: telangana, transco md, power employees, free moment, dgp