లైన్‌మెన్ ‘కరెంట్ ఆట’ .. ట్రాన్స్‌కో డీఈ ఆదేశాలను సైతం పక్కనపెట్టి..

దిశ, మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చేలిక చందర్ రావు అనే రైతుకు అగ్రికల్చర్ సర్వీస్ లైన్ ఉంది. అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఆ రైతు సర్వీస్ లైన్‌ను తొలగిస్తూ, కాంట్రాక్టర్, ఆపరేటర్లతో కుమ్మక్కైన లోకల్ లైన్ మెన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ రైతు ఆందోళన చెందుతున్నాడు. విద్యుత్ సర్వీసులకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులతో లైన్ మెన్ కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తూ రైతులను ఇబ్బందులకు […]

Update: 2021-09-24 05:35 GMT

దిశ, మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చేలిక చందర్ రావు అనే రైతుకు అగ్రికల్చర్ సర్వీస్ లైన్ ఉంది. అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఆ రైతు సర్వీస్ లైన్‌ను తొలగిస్తూ, కాంట్రాక్టర్, ఆపరేటర్లతో కుమ్మక్కైన లోకల్ లైన్ మెన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ రైతు ఆందోళన చెందుతున్నాడు. విద్యుత్ సర్వీసులకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులతో లైన్ మెన్ కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని రైతులు, ప్రజలు మండిపడుతున్నారు. ఇట్టి విషయమై రైతు చందర్ రావు ట్రాన్స్‌కో డీఈ దృష్టికి తీసుకెళ్లగా తన సర్వీసును పునరుద్ధరించాలని ట్రాన్స్‌కో ఏఈ ఆస శంకర్ ను ఆదేశించారు.

దీంతో శుక్రవారం రోజున తన అగ్రికల్చర్ సర్వీసును పునరుద్ధరించారని రైతు తెలిపాడు. తన సర్వీసును పునరుద్ధరించిన రెండు గంటల వ్యవధిలోనే ఆపరేటర్ శ్రీనివాస్ సర్వీసును అనధికారికంగా తొలగించాడని రైతు వాపోయాడు. డీఈ, ఏఈ ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్న ఆపరేటర్ శ్రీనివాస్, కాంట్రాక్టర్ ప్రశాంత్ లకు ఎవరి అండదండలు ఉన్నాయని, విద్యుత్ శాఖతో ఎలాంటి సంబంధం లేని వారికి ఈ హక్కు ఎవరు ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ తో ఎలాంటి సంబంధం లేని ఆపరేటర్ శ్రీనివాస్, కాంట్రాక్టర్ ప్రశాంత్ లతో కుమ్మక్కైన లోకల్ లైన్ మెన్ లపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం జరిగేలా చూడాలని రైతు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశాడు.

Tags:    

Similar News