టెల్కోలను రీఛార్జ్ వివరాలు కోరిన ట్రాయ్!
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో ప్రీపెయిడ్ వినియోగదారుల రీఛార్జ్ విధానాలు, ఇతర సంబంధిత సమాచారం ఉన్న డేటాను అందించాలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సహా ఇతర టెలికాం కంపెనీలను టెలికామ్ రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ మంగళవారం కోరింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఈ అంశంపై 24 గంటల్లోగా స్పందన కోరిందని సంబంధిత అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మే 3 వరకూ పొడిగించినందున ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీలు, రాష్ట్ర స్థాయి […]
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో ప్రీపెయిడ్ వినియోగదారుల రీఛార్జ్ విధానాలు, ఇతర సంబంధిత సమాచారం ఉన్న డేటాను అందించాలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సహా ఇతర టెలికాం కంపెనీలను టెలికామ్ రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ మంగళవారం కోరింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఈ అంశంపై 24 గంటల్లోగా స్పందన కోరిందని సంబంధిత అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మే 3 వరకూ పొడిగించినందున ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీలు, రాష్ట్ర స్థాయి టెలికాం కంపెనీలతో సహా అన్ని సంస్థలకు ట్రాయ్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. టెలికాం కంపెనీల నుంచి స్పందన అందిన తర్వాత ప్రీపెయిడ్ ప్రయోజనాలను విస్తరించాల్సిన విధానంపై అభిప్రాయాన్ని ఖరారు చేయనుంది. వ్యాలిడిటీ పొడిగింపు, టాక్‌టైమ్ క్రెడిట్ ద్వారా లబ్ది పొందిన చందాదారుల డేటాను సైతం టెలికామ్ కంపెనీల నుంచి కోరింది. లాక్‌డౌన్ సమయంలో రీఛార్జ్ చేయలేకపోయిన చందాదారుల సంఖ్యపై కూడా డేటా కోరింది.
వొడాఫోన్ ఐడియా ఇంతకుముందు ఏప్రిల్ 17 వరకు ఫీచర్ ఫోన్‌లకు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై గడువును పొడిగించింది. అలాగే, రూ. 10 ల టాక్‌టైమ్ క్రెడిట్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్ సైతం 8 కోట్లకు పైగా ప్రీపెయిడ్ కనెక్షన్ల వ్యాలిడిటీ పెంచుకునేందుకు ఏప్రిల్ 17 వరకూ పొడిగించింది. రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ఏప్రిల్ 17 వరకూ 100 నిమిషాల్ ఉచిత టాక్‌టైమ్, 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లను అందించింది.
Tags: coronavirus, covid-19, Lockdown, Trai, telecom sector, telcos