హైదరాబాద్‌లో వాహనాల దారి మళ్లింపు..
దిశ ప్రతినిధి , హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని ఉస్మాన్ గంజ్ నాలా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా నవంబర్ 15వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందని ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ వెల్లడించారు. మంగళవారం ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, ఏసీపీ శ్రీనివాస రెడ్డి తదితర అధికారులతో కలిసి ఆయన నాలా మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇది జులై ఒకటి నుంచి జీహెచ్‌ఎంసీ అధికారుల […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని ఉస్మాన్ గంజ్ నాలా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా నవంబర్ 15వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందని ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ వెల్లడించారు. మంగళవారం ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, ఏసీపీ శ్రీనివాస రెడ్డి తదితర అధికారులతో కలిసి ఆయన నాలా మరమ్మతు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇది జులై ఒకటి నుంచి జీహెచ్‌ఎంసీ అధికారుల విజ్ఞప్తి మేరకు ఉస్మాన్ గంజ్ వద్ద ట్రాఫిక్‌ను దారి మళ్ళిస్తున్నట్లు వివరించారు. నెలరోజుల వ్యవధిలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. భారీవర్షాలు, వరదల కారణంగా వాటిని పూర్తి చేయలేక పోయామని, దాంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. నగర సీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు నాలా మరమ్మతు పనులను జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో పరిశీలించి పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించినట్లు తెలిపారు. నవంబర్ 15 వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని, కావున వాహనదారులు, ప్రజలు సహకరించాలని అదనపు కమిషనర్ అనిల్ కుమార్ కోరారు.