భార్యకు ఊరినే రాసిచ్చిన భర్త

దిశ, వెబ్ డెస్క్ : ఆదివాసిలు నివసించే గ్రామాన్ని తన భార్యపై రిజిస్టర్ చేయించుకున్నాడు ఓ వ్యాపారి. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. నిర్మల్ జల్లా పెంబి మండలంలోని వేణునగర్ ఆదివాసీలు గతంలో అటవీ ప్రాతంలోని కొత్తచెరువుగూడలో నివసించే వారు. గ్రామం నుంచి పెంబి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న 4.32 ఎకరాల (అసైన్డ్) వ్యవసాయ భూమిని రూ. 60 వేలకు కొనుగోలు చేశారు. అనతంరం అక్కడ గుడిసెలు […]

Update: 2021-04-17 23:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆదివాసిలు నివసించే గ్రామాన్ని తన భార్యపై రిజిస్టర్ చేయించుకున్నాడు ఓ వ్యాపారి. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. నిర్మల్ జల్లా పెంబి మండలంలోని వేణునగర్ ఆదివాసీలు గతంలో అటవీ ప్రాతంలోని కొత్తచెరువుగూడలో నివసించే వారు. గ్రామం నుంచి పెంబి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న 4.32 ఎకరాల (అసైన్డ్) వ్యవసాయ భూమిని రూ. 60 వేలకు కొనుగోలు చేశారు. అనతంరం అక్కడ గుడిసెలు వేసుకుని నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ భూమిని పెంబికి చెందిన ఓ వ్యాపారి 2002లో తన భార్యపేరిట నిర్మల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.భూమిని అమ్మినవారికి కానీ, కొన్నవారికి కానీ ఈ విషయం తెలియకపోవడం విచిత్రం.

ఆదివాసీలకు భూమి అమ్మిన విషయమై సాక్షి సంతకాలు కావాలని చెప్పి.. దేవ నడ్పి పెద్దులు, చిన్న పెద్దులు, దేవ బక్కన్నల సంతకాలు తీసుకుని సదరు వ్యాపారి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుత ఈ భూమి ధర కోటి రూపాయలకు పైగా పలుకుతుంది. తాజాగా వ్యాపారి ఆదివాసీల వద్దకు వచ్చి ఈ భూమి తనదేనని చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా ధరణిలో ఈ భూమి వ్యాపారి పేరుపై నమోదయ్యి రైతు బంధు సాయం అందుకుంటుడడం గమనార్హం.

Tags:    

Similar News