‘ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలి’
దిశ, హైదరాబాద్ బ్యూరో రాష్ట్రంలోని 4 లక్షల ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సుమారు 3 లక్షల పెన్షనర్లకే పీఆర్‌సీ(పే రివిజన్ కమిషన్)ను వెంటనే ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అందులో పలు అంశాలను ఉత్తమ్ ప్రస్తావించారు.తెలంగాణ వచ్చిన తర్వాత తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటూనే వారి హక్కులను కాలరాస్తున్నదని పేర్కొన్నారు. పీఆర్‌సీ […]
దిశ, హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలోని 4 లక్షల ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సుమారు 3 లక్షల పెన్షనర్లకే పీఆర్‌సీ(పే రివిజన్ కమిషన్)ను వెంటనే ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అందులో పలు అంశాలను ఉత్తమ్ ప్రస్తావించారు.తెలంగాణ వచ్చిన తర్వాత తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటూనే వారి హక్కులను కాలరాస్తున్నదని పేర్కొన్నారు. పీఆర్‌సీ విషయానికి వస్తే జులై 1, 2018 నుంచి రావాల్సిన 11వ పీఆర్‌సీ 20 నెలలు గడుస్తున్నా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.ఈ ఆరేండ్లలో వేలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినందున ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గిందన్నారు.అయినా కూడా పీఆర్‌సీని ప్రకటించకుండా జాప్యం చేయడం సరికాదన్నారు.పీఆర్‌సీ కాల పరిమితి ఐదేండ్లు కానీ మూడేండ్ల వరకు ఫిట్‌మెంట్ ఇవ్వకపోతే ఉద్యోగులు మూడేండ్లు ఆర్ధికంగా నష్టపోయినట్టు కాదా అని కేసీఆర్‌ను నిలదీశారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇ.హెచ్.ఎస్ వైద్యం అందడం లేదని ఇదేనా మీ ప్రభుత్వ పనితీరుఅని విమర్శలు గుప్పించారు. కారణమేంటని ఆస్పత్రుల యాజమాన్యాలను అడిగితే ప్రభుత్వం రూ.1200 కోట్ల బకాయి ఉందని అవి చెల్లిస్తేనే మీకు వైద్యమంటూ బయటకు పంపిస్తున్నారని తెలిపారు. ఒకవైపు లక్షల కోట్లు అప్పులు, మరోవైపు ఆర్థికంగా బలోపేతం అంటూ ప్రభుత్వం కల్లబొల్లు కబుర్లు చెబుతుందని, ఇప్పటికైనా ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు.