ఎర్రబెల్లిని కేబినెట్ నుంచి తొలగించండి : గీతారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిపై అత్యాచారం ఘటనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మంత్రులు మహిళలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మహిళా అధికారిపై ఎర్రబెల్లి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ తక్షణమే ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలని, మంత్రి వర్గం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరుగడం లేదని, కేబినెట్లో కూడా ప్రాధాన్యత లేదన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిపై అత్యాచారం ఘటనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మంత్రులు మహిళలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మహిళా అధికారిపై ఎర్రబెల్లి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
కేసీఆర్ తక్షణమే ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలని, మంత్రి వర్గం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరుగడం లేదని, కేబినెట్లో కూడా ప్రాధాన్యత లేదన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని గీతారెడ్డి వెల్లడించారు.