ఆడియో ఎఫెక్ట్.. కౌశిక్ రెడ్డికి భారీ షాక్..

దిశ,వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ టికెట్ తనకేనంటూ మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఆడియోను క్రమశిక్షణ సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో క్రమశిక్షణ సంఘం కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆడియోపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ […]

Update: 2021-07-11 23:23 GMT

దిశ,వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ టికెట్ తనకేనంటూ మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఆడియోను క్రమశిక్షణ సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో క్రమశిక్షణ సంఘం కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆడియోపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది.

కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ, టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నారంటూ కౌశిక్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు నోటీసుల జారీ చేసినట్టు పేర్కొన్నారు. గతంలోనే కౌశిక్ రెడ్డిని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించినా ఆయన వైఖరి మార్చుకోలేదని అన్నారు. అయితే ఆరోపణలు వచ్చి 24 గంటలు అయినా కాకముందే రేవంత్ రెడ్డి టీమ్.. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇక ముందు కూడా పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే గట్టి చర్యలు తీసుకుంటామని పరోక్షంగా హెచ్చరించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News