నిఖార్సైన నాయకుడు నాయిని : ఉత్తమ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తొలి హోం శాఖ మంత్రి, మాజీ కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై రాష్ట్రంలోని అనేకమంది ప్రముఖులు ఇప్పటికే సంతాపం ప్రటించారు. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. నాయిని నర్సింహారెడ్డి నిఖార్సియిన కార్మిక నాయకుడు అని ఉత్తమ్ అన్నారు. నాయిని ఆకస్మిక మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన […]

Update: 2020-10-22 01:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తొలి హోం శాఖ మంత్రి, మాజీ కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై రాష్ట్రంలోని అనేకమంది ప్రముఖులు ఇప్పటికే సంతాపం ప్రటించారు. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. నాయిని నర్సింహారెడ్డి నిఖార్సియిన కార్మిక నాయకుడు అని ఉత్తమ్ అన్నారు. నాయిని ఆకస్మిక మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో 1969 నుంచి 2014 వరకు దాదాపు 5 దశాబ్దాలు పోరాటాలు చేసిన మహా నాయకుడు నాయిని అని ఉత్తమ్ వెల్లడించారు.

Tags:    

Similar News