ముంబైతో పోటీ పడుతున్న బాలాపూర్ గణపతి : రేవంత్ రెడ్డి

దిశ, జల్‌పల్లి: ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ గణేషుడు ముంబయితో పోటీ పడే విధంగా ఉత్సవ సమితి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి బాలాపూర్‌ గణేషున్ని రేవంత్ దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం సుభీక్షంగా ఉండాలి.. తెలంగాణ ప్రాంత ప్రజలను ఆ గణపతి కాపాడాలి… కరోనా మహమ్మారి నుంచి తెలంగాణను రక్షించాలి. అంతేగాకుండా తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న శక్తులనుంచి విముక్తి […]

Update: 2021-09-13 12:05 GMT

దిశ, జల్‌పల్లి: ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ గణేషుడు ముంబయితో పోటీ పడే విధంగా ఉత్సవ సమితి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి బాలాపూర్‌ గణేషున్ని రేవంత్ దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం సుభీక్షంగా ఉండాలి.. తెలంగాణ ప్రాంత ప్రజలను ఆ గణపతి కాపాడాలి… కరోనా మహమ్మారి నుంచి తెలంగాణను రక్షించాలి. అంతేగాకుండా తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న శక్తులనుంచి విముక్తి కలగాలని ఆ గణపతిని వేడుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా బాలాపూర్​గణేష్ ఉత్సవ సమితి రేవంత్ రెడ్డిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

అనంతరం లడ్డును ప్రసాదంగా బహుకరించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌ గణపతులను ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేయొద్దు అన్నపుడు రెండులక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే పెద్ద పెద్ద మట్టి విగ్రహాలను ఉచితంగా తయారు చేయించి, అందిస్తే పర్యావరణ కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపడుకుంటూనే ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించినట్టు ఉంటదని అన్నారు. గణేష్ ఉత్సవాలను హిందువులే కాక, చాలామంది ముస్లిం సోదరులు కూడా పాల్గొంటున్నారని, అది మంచి పరిణామం అన్నారు. గణేష్ ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ ఉత్సవాలను అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయకూడదని అన్నారు. ఈ ఏడాది ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి అవకాశం కల్పించాలని అధికారులకు, పోలీసులకు, ప్రభుత్వ సిబ్బందికి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News