కేసీఆర్‌ ముఖంలో మొదటిసారి భయం కనిపిస్తోంది.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

దిశ, జవహర్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లిలో టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. బుధవారం దీక్ష వద్ద మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ… తెలంగాణలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరింనట్లు అని అన్నారు. కేసీఆర్‌కు 20 నెలల భయం పట్టుకున్నదని ఎద్దేవా చేశారు. మొదటి సారి కేసీఆర్‌‌లో భయం కనిపిస్తోందని, […]

Update: 2021-08-25 05:42 GMT

దిశ, జవహర్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లిలో టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. బుధవారం దీక్ష వద్ద మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ… తెలంగాణలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరింనట్లు అని అన్నారు. కేసీఆర్‌కు 20 నెలల భయం పట్టుకున్నదని ఎద్దేవా చేశారు. మొదటి సారి కేసీఆర్‌‌లో భయం కనిపిస్తోందని, అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం తరువాత పార్టీలో సీనియర్లు ఎవరు బ్రీఫ్ చేయలేదని.. ఆఖరుకు కేసీఆర్ ఆవేదన చూసి కేటీఆర్ మీడియా సమావేశం పెట్టారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌లో ఉద్దండులు మీడియా ముందుకు రావడానికి బయపడుతున్నారని, భవిష్యత్‌లో టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు కేసీఆర్ పక్కన కూర్చోడానికి భయపడతారని అన్నారు.

కేసీఆర్ ఒంటరి అయ్యాడని, అందుకే ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని, ఆ భ్రమల్లోనుంచి జనాలు ఇప్పుడు బయటకు వస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘నేను రాత్రి దళిత వాడలో పడుకున్న ఇళ్ళు 35 సంవత్సరాల క్రితం నాటి ఇందిరమ్మ ఇళ్ళు. మూడు చింతలపల్లి గ్రామానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మూడు చింతలపల్లిలో కేసీఆర్ ఫౌంహౌస్ కోసం రోడ్డును రెండేండ్ల క్రితం ఆరు ఫీట్లు పెంచి వేశారు. ఇళ్లు కిందకి ఐనయ్, రోడ్డుపైకి అయింది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇంతవరకు ఇవ్వలేదు. వర్షం పడగానే ఆ ఇళ్ళు చెరువులను తలపిస్తున్నాయి. ‘దళితబంధు’ అందరికీ ఇవ్వాలనేది మా డిమాండ్. బడ్జెట్ సరిపోకపోతే సెక్రటేరియట్, అసెంబ్లీ అమ్ముదాం, ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు పెడ్తాం. జీహెచ్ఎంసీలో అందరికీ 10 వేల సాయం ఇవ్వలేని కేసీఆర్, ‘దళితబంధు’ అంటే నమ్మగలమా’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News