పెట్రోల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
దిశ, తెలంగాణ బ్యూరో: అడ్డూ అదుపులేకుండా రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర తగ్గినప్పటికీ వినియోగదారుడికి ఊరట లభించడం లేదన్నారు. వాస్తవ ధర కంటే రెండు రెట్లు అధికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో బాదడం మూలంగానే ఈ ధరలు పెరిగాయని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పిలుపుమేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా […]
దిశ, తెలంగాణ బ్యూరో: అడ్డూ అదుపులేకుండా రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర తగ్గినప్పటికీ వినియోగదారుడికి ఊరట లభించడం లేదన్నారు. వాస్తవ ధర కంటే రెండు రెట్లు అధికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో బాదడం మూలంగానే ఈ ధరలు పెరిగాయని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పిలుపుమేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు. నిర్మల్‌లో జరిగే నిరసనలో తాను పాల్గొంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొనాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.