టయోటా మెరుగైన సర్వీసుల కోసం 'స్మైల్స్ ప్లస్' ఆఫర్
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) తన వినియోగదారుల కోసం ప్రీ-పెయిడ్, కస్టమైజ్ సర్వీస్ ప్యాకేజీని శుక్రవారం విడుదల చేసింది. ‘స్మైల్స్ ప్లస్’ ఆఫర్ కింద అనుకూలమైన ప్రాంతంలో సర్వీసులు, టయోటా ఒరిజినల్ పరికరాల, సర్వీస్ ధరల విషయంలో పలు ప్రయోజనాలను అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తమ కంపెనీ వినియోగదారులకు మెరుగైన మొబిలిటీ అవసరాలను తీర్చే ప్రయత్నాల్లో భాగంగానే టయోటా ‘స్మైల్స్ ప్లస్’ ఆఫర్ను ఇస్తున్నట్టు టీకేఎం సీనియర్ […]
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) తన వినియోగదారుల కోసం ప్రీ-పెయిడ్, కస్టమైజ్ సర్వీస్ ప్యాకేజీని శుక్రవారం విడుదల చేసింది. ‘స్మైల్స్ ప్లస్’ ఆఫర్ కింద అనుకూలమైన ప్రాంతంలో సర్వీసులు, టయోటా ఒరిజినల్ పరికరాల, సర్వీస్ ధరల విషయంలో పలు ప్రయోజనాలను అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తమ కంపెనీ వినియోగదారులకు మెరుగైన మొబిలిటీ అవసరాలను తీర్చే ప్రయత్నాల్లో భాగంగానే టయోటా ‘స్మైల్స్ ప్లస్’ ఆఫర్ను ఇస్తున్నట్టు టీకేఎం సీనియర్ వైస్-ప్రెసిడెంట్ నవీన్ సోనీ చెప్పారు. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లకు కొత్త సేవలను అందించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఈ సేవలను అందించడం ద్వారా వినియోగదారులతో తమకున్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. ఇటీవల మారుతున్న వినియోగదారుల అవసరాలకు తగినట్టుగా, ఆటోమొబైల్ మార్కెట్లో డిమాండ్లకు అనుగుణంగా మరిన్ని సేవలను అందించనున్నట్టు నవీన్ సోనీ వెల్లడించారు.