రేపటి నుంచి భూమి, వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రేపటి నుంచి భూమి, వాహన రిజిస్ర్టేషన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ దృష్యా హైకోర్టు ఆదేశాల మేరకు మే-12 వ తేదీ నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భూమి, వాహన క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. అయితే, రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ సడలింపులు చేయడంతో పాటు ప్రభుత్వ రెవెన్యూ […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రేపటి నుంచి భూమి, వాహన రిజిస్ర్టేషన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ దృష్యా హైకోర్టు ఆదేశాల మేరకు మే-12 వ తేదీ నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భూమి, వాహన క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. అయితే, రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ సడలింపులు చేయడంతో పాటు ప్రభుత్వ రెవెన్యూ లోటును దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ల శాఖకు మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ ఆదివారం సాయంత్రం ఆమోదించింది.