ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ.. వైరస్ వ్యాప్తిని ఉధృతం చేస్తున్నాయి. ఇక తాజా కేసులతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది. సోమవారం వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ రాష్ట్రంలో కొత్తగా 6051 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారీన పడి మరో 49 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో 1090 మంది కరోనాతో […]

Update: 2020-07-27 08:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ.. వైరస్ వ్యాప్తిని ఉధృతం చేస్తున్నాయి. ఇక తాజా కేసులతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది. సోమవారం వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ రాష్ట్రంలో కొత్తగా 6051 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారీన పడి మరో 49 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో 1090 మంది కరోనాతో మరణించారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,02,349కి చేరింది. ఇందులో వైరస్ నుంచి కోలుకొని 49,558 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు ఒక్క రోజే 3,234 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 51,701 యాక్టివ్ కేసులున్నాయి.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1210, గుంటూరులో 744, కర్నూలులో 664, విశాఖలో 655, అనంతపుర్‌లో 524, నెల్లూరులో 422, వెస్ట్ గోదావరిలో 408, చిత్తూరు 367, కడప 336, ప్రకాశం 317, విజయనగరం 157, కృష్ణా 127, శ్రీకాకుళం జిల్లాలో 120 కేసులు వెలుగుచూశాయి. మరణాలను సంఖ్య పరిశీలిస్తే.. పశ్చిమ గోదావరిలో 9 , విశాఖలో 8, చిత్తూరులో 7, తూర్పుగోదావరిలో 7, కృష్ణాలో 5రు, విజయనగరంలో 4, అనంతపురంలో 3, కర్నూులో 2, శ్రీకాకుళంలో 2, కడప, ప్రకాశంలో జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు.

Tags:    

Similar News