అరచేతిలో అద్భుత రుచులు
మీరు ఫుడ్ లవరా? ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వంటకం చేయాలనీ, దానిని రుచి చూడాలని తపన పడుతుంటారా? లేదంటే మీది బ్యాచిలర్ బ్యాచా? ఉన్న వాటితోనే సరికొత్త వంటకం చేయాలనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే. ఇందుకోసం ఏవేవో వంటల పుస్తకాలు కొనో, వంటల ప్రోగ్రామ్స్ చూసో సమయం వృథా చేసుకోవక్కర్లేదు. కేవలం మీ అరచేతిలో ఉన్న స్మార్ట్‌ను ఉపయోగిస్తే చాలు. ఉన్న ఐటెమ్స్‌తోనే క్షణాల్లో సరికొత్త రెసిపీ సిద్ధం చేసుకోవచ్చు. ఒక్క క్లిక్కుతో ప్రపంచంలో ఉన్న […]
మీరు ఫుడ్ లవరా? ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వంటకం చేయాలనీ, దానిని రుచి చూడాలని తపన పడుతుంటారా? లేదంటే మీది బ్యాచిలర్ బ్యాచా? ఉన్న వాటితోనే సరికొత్త వంటకం చేయాలనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే. ఇందుకోసం ఏవేవో వంటల పుస్తకాలు కొనో, వంటల ప్రోగ్రామ్స్ చూసో సమయం వృథా చేసుకోవక్కర్లేదు. కేవలం మీ అరచేతిలో ఉన్న స్మార్ట్‌ను ఉపయోగిస్తే చాలు. ఉన్న ఐటెమ్స్‌తోనే క్షణాల్లో సరికొత్త రెసిపీ సిద్ధం చేసుకోవచ్చు. ఒక్క క్లిక్కుతో ప్రపంచంలో ఉన్న వంటకాలన్నీ మీ ముందుంటాయి. అందుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక యాప్స్ మీకోసమే.. ఓ సారి ట్రై చేయండి.
యమ్లీ రెసిపీస్ (yummly)
ఎప్పటికప్పుడూ సరికొత్త రుచులను టేస్ట్ చేయాలనుకునే ఫుడీస్‌కు ఇది బెస్ట్ వెబ్‌సైట్. ప్లేస్టోర్‌లో 4.6రేటింగ్ ఉన్న ఈ యాప్‌ను.. 5మిలియన్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చెయ్యగానే సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది. అందులో మీకు నచ్చిన వంటకాన్ని ఎంటర్ చేస్తే.. సంబంధించిన అనేక రకాల వంటకాలు నోరూరించే ఫోటోలతో కనిపిస్తాయి. అందులో మనం చేయాలనుకున్న దానిపై క్లిక్ చేస్తే.. వంటకు కావాల్సిన పదార్థాలు, పట్టే సమయం చూపిస్తుంది. అంతేకాకుండా, ఆ వంటకం ద్వారా మనం ఎన్ని క్యాలరీలు పొందుతామో కూడా చూపిస్తుంది. అనంతరం రీడ్ డైరెక్షన్‌పై క్లిక్ చేయగానే వంటచేయు విధానం ఉంటుంది. దాని ఫాలో అవుతూ ఎలాంటి వంటనైనా సులభంగా చేసుకోవచ్చు.
సూపర్ కుక్..(supercook)
కొత్త రుచులను ఆస్వాదించాలనుకునే వారికోసం మరొక బెస్ట్ యాప్ ‘supercook’. ప్లేస్టోర్లో 50వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్న సూపర్‌కుక్ యాప్‌కు సైతం 4.6రేటింగ్ ఉంది. ఈ యాప్‌ను గానీ, వెబ్‌సైట్‌ను గానీ ఓపెన్ చేయగానే హోం పేజీలో వంటల కేటగిరీలు ఉంటాయి. అలాగే, సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న ఐటెమ్స్‌తోనే సరికొత్త వంట చేయాలనుకుంటే వాటిని ఈ సెర్చ్‌బాక్స్‌లో టైప్ చేయాలి. లేదా కేటాగిరీల నుంచి ఎంచుకోవాలి. వెంటనే ఫలితాల్లో అనేక రకాల వంటలు ప్రత్యక్షమవుతాయి. అందులో మీకు నచ్చిన దానిపై క్లిక్ చేస్తే అది ఏ దేశపు వంటకమో అన్న విషయంతో పాటు, కావాల్సిన పదర్థాలు, పట్టే సమయం వంటి వివరాలు వస్తాయి. వాటిని అనుసరిస్తూ వంటపూర్తి చేయొచ్చు. అనంతరం ఆ రెసిపీని సామాజికమాజిక మాధ్యమాల్లోనూ పంచుకోవచ్చు.
కుక్‌థింగ్ (Cookthing)
ఈ వెబ్సైట్‌ను ఓపెన్ చేయగానే అనేక కేటగిరీలతో పాటు సెర్చ్, క్రియేట్ రెసిపీ, వ్యూ రెసిపీస్, క్వశ్చన్ ఆన్సర్స్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులోనూ పై వెబ్‌సైట్‌ల మాదిరిగానే మీ దగ్గర ఉన్న ఐటెమ్స్‌తో గానీ, లేదంటే మీకు నచ్చిన వంటకాన్ని గానీ సెర్చ్ చేస్తే, తయారు చేయు విధానం వస్తుంది. అయితే, ఇందులో అదనంగా క్రియేట్ రెసిపీ అనే ఆప్షన్ ఉంది. మీరేదైనా కొత్త వంటతయారు చేస్తే దానిని ఇందులో పంచుకోవచ్చు.
ఇలా ఇవే కాకుండా ఇంకా చాలా వెబ్‌సైట్లు, యాప్‌లు ఉన్నాయి. వీటిల్లో recipebridge, ohlardy.com, rock your meal, sidechef, cookpad యాప్‌లు సైతం సరికొత్త వంటకాలను తయారుచేయడంలో తోడ్పడతాయి.
Tags: cooking apps, smartphone, yummly, supercook, cookthing