కరోనా సోకి బెంగాల్‌లో వైద్యుడు మృతి.. మమత నివాళి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కరోనా బారినపడి తొలిసారి ఓ సీనియర్ వైద్యుడు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని ఆరోగ్య సేవా విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ విప్లవ్ కాంతి దాస్‌గుప్తా(60)కు వారం క్రితం కరోనా టెస్టులు నిర్వహించగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తుండగా, ఆదివారం మృతిచెందారు. కాగా, వైద్యుడి భార్యకూ కరోనా సోకినట్టు తేలడంతో చికిత్సనందిస్తున్నారు. వైద్యుని మృతి విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా […]

Update: 2020-04-26 07:20 GMT

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కరోనా బారినపడి తొలిసారి ఓ సీనియర్ వైద్యుడు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని ఆరోగ్య సేవా విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ విప్లవ్ కాంతి దాస్‌గుప్తా(60)కు వారం క్రితం కరోనా టెస్టులు నిర్వహించగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తుండగా, ఆదివారం మృతిచెందారు. కాగా, వైద్యుడి భార్యకూ కరోనా సోకినట్టు తేలడంతో చికిత్సనందిస్తున్నారు. వైద్యుని మృతి విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆయన చేసిన త్యాగం మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, బెంగాల్‌లో కరోనా పాజిటివ్ కేసులు 600కు పైగా నమోదవ్వగా, 18మంది మృతి చెందారు.

tags: bengal doctor died of corona, coronavirus, mamata banerjee, twitter, tribute, bengal doctor, covid 19

Tags:    

Similar News