2020 టాప్ 5 వెబ్ సిరీస్
దిశ, వెబ్‌డెస్క్ : డిసెంబర్‌లో దాదాపు ఏ వెబ్‌సైట్ చూసినా ఇలాంటి కథనాలే కనిపిస్తాయి. అన్ని విషయాల్లోనూ టాప్ 10, టాప్ 20 అంటూ జాబితాలు సిద్ధం చేస్తుంటారు. కానీ, 2020 సంగతి వేరు. గతంలో ఇలా జాబితాలు సిద్ధం చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది, ఇప్పుడు అంత కష్టపడక్కర్లేదు. ఎందుకంటే 2020లో చేసిన ప్రతి దానికి స్మార్ట్‌ఫోన్ సాక్ష్యంగా నిలిచింది. నిజం చెప్పాలంటే 80 శాతం సమయం స్మార్ట్‌ఫోన్‌తో గడిచిపోయింది. కాబట్టి చేసిన ప్రతి పనికి […]
దిశ, వెబ్‌డెస్క్ : డిసెంబర్‌లో దాదాపు ఏ వెబ్‌సైట్ చూసినా ఇలాంటి కథనాలే కనిపిస్తాయి. అన్ని విషయాల్లోనూ టాప్ 10, టాప్ 20 అంటూ జాబితాలు సిద్ధం చేస్తుంటారు. కానీ, 2020 సంగతి వేరు. గతంలో ఇలా జాబితాలు సిద్ధం చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది, ఇప్పుడు అంత కష్టపడక్కర్లేదు. ఎందుకంటే 2020లో చేసిన ప్రతి దానికి స్మార్ట్‌ఫోన్ సాక్ష్యంగా నిలిచింది. నిజం చెప్పాలంటే 80 శాతం సమయం స్మార్ట్‌ఫోన్‌తో గడిచిపోయింది. కాబట్టి చేసిన ప్రతి పనికి ఏదో ఒక రూపంలో స్మార్ట్ ఫోన్‌లో దానికి సంబంధించిన రికార్డ్ దొరుకుతుంది. అయితే పాండమిక్ సమయంలో ఎక్కువ మంది వెబ్ సిరీస్‌లకు అలవాటైపోయారు. విదేశీ వెబ్‌సిరీస్‌ల సంగతి పక్కన పెడితే దేశీయ వెబ్‌సిరీస్‌లకు ఈ ఏడాది చాలా ఆదరణ పెరిగింది. నటీనటులు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లకు కాకుండా కంటెంట్‌కే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మరి మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల మదిని దోచుకున్న టాప్ 5 భారతీయ వెబ్‌సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా?
1. స్కామ్ 1992 :
ప్రేక్షకులు కంటెంట్‌కే పెద్ద పీట వేస్తారని బల్లగుద్ది మరీ నిరూపించిన సిరీస్ ఇది. 2020లో భారతీయ వెబ్ సిరీస్‌లకు ఒక ప్రమాణాన్ని సెట్ చేసింది. స్టాక్ బ్రోకర్ హన్సల్ మెహతా జీవిత కథలో సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కేవలం నోటి మాట ద్వారానే పాపులారిటీ సంపాదించుకుంది. ఇక టైటిల్ ఇంట్రో మ్యూజిక్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. కథ, కథనం, నటన, నేపథ్యం సంగీతం ఇలా అన్ని విభాగాల్లోనూ ఈ సిరీస్‌కు మంచి మార్కులు పడ్డాయి. అందుకే 2020లో వచ్చిన ఉత్తమ సిరీస్‌లలో సోనీ లివ్‌లో విడుదలైన ఈ సిరీస్ నిలిచింది.
2. ఆర్య :
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే మిగతా ఎపిసోడ్‌లు మొత్తం చూడకుండా అస్సలు ఆగలేని విధంగా ఈ సిరీస్ స్క్రీన్‌ప్లే ఉంటుంది. సుస్మిత నటన, చక్కని కేరెక్టరైజేషన్, హిందీ సినిమా సంగీతం అన్ని కలగలిపి ఈ సిరీస్ వీక్షకుడికి మంచి థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది.
3. స్పెషల్ ఆప్స్ :
కంటెంట్ పేరు చెప్పి అందరూ ఫ్యామిలీ ఓరియెంటెడ్, ఆసక్తికర కథనాలతోనే వెబ్ సిరీస్‌లు తీస్తున్నారు. ఒక్కరు కూడా యాక్షన్ సిరీస్‌లు తీయడం లేదని బాధపడిన సగటు వీక్షకుడికి మంచి యాక్షన్ సిరీస్‌గా వారి ఆకలిని ఈ స్పెషల్ ఆప్స్ తీర్చింది. నీరజ్ పాండే సృష్టించిన ఈ సిరీస్‌లో కె.కె.మీనన్ తన నటనతో అందరి మనసులు కొల్లగొట్టేశాడు. తీవ్రవాదులు, బాంబు దాడులు, వారి ట్రైనింగ్, వారిని మట్టుబెట్టడానికి ఇంటెలిజెన్స్ చేసే ప్రయత్నం ఇలా అన్ని యాక్షన్ హంగులు ఉన్న ఈ సిరీస్‌ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది.
4. పాతాళ్ లోక్ :
ఒక సిరీస్‌ను ఇంటెలిజెంట్ అని ప్రశంసించాలంటే అందులో చాలా గొప్ప కంటెంట్ ఉండాలి. మరి పాతాల్ లోక్ విడుదలైన తర్వాత రివ్యూ రాసిన ప్రతి ఒక్కరూ దాన్ని ఇంటెలిజెంట్ అని పొగడకుండా ఉండలేకపోయారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన మొదటి రోజు నుంచి మంచి మార్కులు కొట్టేసింది. అటు రాజకీయాలను, ఇటు మీడియాను, అలాగే పోలీసు వ్యవస్థను మూడింటినీ సమన్వయం చేసుకుంటూ లోతైన అంశాలతో తెరకెక్కించిన ఈ సిరీస్‌ను విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రధాన పాత్రలో కనిపించిన జయదీప్ అహ్లావట్ నటనను కొనియాడని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో!
5. బందీష్ బ్యాండిట్స్ :
ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే వీక్షకులు ఈ బందీష్ బ్యాండిట్స్ సిరీస్ ఒక రీఫ్రెష్‌మెంట్ లాంటిది. ఎందుకంటే క్రైమ్, థ్రిల్లర్, డ్రామాలతో ఉన్న సిరీస్‌లు చూసి చూసి విసిగివేసారిపోయి ఉన్న వీక్షకునికి ఈ సిరీస్ ఒక సంగీత మధురానుభూతిని అందించింది. శాస్త్రీయ సంగీతం, పాప్ సంగీతాన్ని మేళవించి, ఆ రెండింటి మధ్య సమన్వయాన్ని చూపించిన తీరు అద్భుతంగా ఉంటుంది. నసీరుద్దీన్ షా, అతుల్ కులకర్ణి, షీబా చద్దా లాంటి దిగ్గజ నటులు ఉన్న ఈ సిరీస్‌ను, ఇందులోని పాటలను ప్రేక్షకులు అమితంగా ఆదరించారు.
ఇవి మాత్రమే కాకుండా 2020లో విడుదలైన దాదాపు ప్రతి ఒక్క పాపులర్ వెబ్‌సిరీస్ మంచి ప్రశంసలు అందుకున్నది. సోనీ లివ్‌లో విడుదలైన ఎ సింపుల్ మర్డర్, ఎరోస్ నౌలో ప్రసారమవుతున్న ఫ్లెష్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న పంచాయత్, వూట్‌లో విడుదలైన ది గాన్ గేమ్, అసుర్ లాంటి సిరీస్‌లు కూడా విభిన్న కథాంశాలతో, చక్కని కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్‌లు అన్ని పెద్దఎత్తున ప్రచారం లేకుండా కేవలం కంటెంట్ క్వాలిటీ ద్వారా మాత్రమే ప్రేక్షకులకు దగ్గరయ్యాయి.