రేపు పశ్చిమ గోదావరి షట్‌డౌన్
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తుండటంతో కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు ఉంటాయన్నారు. రేపు గిరిజన దినోత్సవం సందర్భంగా 5 ఏజెన్సీ మండలాలకు లాక్ డౌన్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, శనివారం జిల్లా వ్యాప్తంగా 681 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే […]
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తుండటంతో కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు ఉంటాయన్నారు. రేపు గిరిజన దినోత్సవం సందర్భంగా 5 ఏజెన్సీ మండలాలకు లాక్ డౌన్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, శనివారం జిల్లా వ్యాప్తంగా 681 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో 10 మంది కోలుకోలేక మృత్యువాత పడ్డారు.