'రజనీకాంత్ తరువాత బన్నీయే'
సినీ నటుడు శివాజీ అజ్ఞాతం వీడినట్టున్నాడు. టీవీ9 షేర్ల కొనుగోలు వివాదం తరువాత సుదీర్ఘ విరామం తరువాత శివాజీ మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమన్న శివాజీ, ఇప్పటి హీరోల్లో అల్లు అర్జున్‌ను ఎక్కువగా అభిమానిస్తానని అన్నాడు. ఒక సినిమా కోసం బన్నీ పడే కష్టం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని అన్నాడు. తానే గనుక […]
సినీ నటుడు శివాజీ అజ్ఞాతం వీడినట్టున్నాడు. టీవీ9 షేర్ల కొనుగోలు వివాదం తరువాత సుదీర్ఘ విరామం తరువాత శివాజీ మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమన్న శివాజీ, ఇప్పటి హీరోల్లో అల్లు అర్జున్‌ను ఎక్కువగా అభిమానిస్తానని అన్నాడు. ఒక సినిమా కోసం బన్నీ పడే కష్టం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని అన్నాడు. తానే గనుక అల్లు అరవింద్ కొడుకును అయ్యుంటే అంతగా కష్టపడేవాడ్ని కాదేమోనని శివాజీ అభిప్రాయపడ్డారు.
దక్షిణాది సినీ పరిశ్రమలో తలైవా రజనీకాంత్ తరువాత తిరిగి ఆ స్థాయి అందుకోగలిగే నటుడెవరైనా ఉన్నారంటే అది బన్నీ ఒక్కడేనని ఆకాశానికెత్తేశాడు. ‘సరైనోడు’ సినిమాలో అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్ తనకు బాగా ఇష్టమని చెప్పాడు. అందుకే ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదని పేర్కొన్నాడు.