గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
నారాయణగూడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు

దిశ, హిమాయత్ నగర్ : నారాయణగూడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్సైజ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ సీఐ ఎస్.కల్పన మాట్లాడుతూ.. ఎక్సైజ్ సూపరింటెంట్ ఎన్. శ్రీనివాసరావు ఆదేశాలనుసారంగా ఉస్మానియా డెంటల్ హాస్పిటల్ సమీపంలో రూటు వాచ్ నిర్వహించామన్నారు. ఈ రూటు వాచ్ లో గంజాయి రవాణా చేస్తున్న దూలపేట, జింగురు బస్తీ చెందిన అమృత లాల్ సింగ్ ను అరెస్ట్ చేసామని తెలిపారు. రెండు బైకులలో తరలిస్తున్న 2 కేజీల 500 గ్రాముల ఎండు గంజాయి సీజ్ చేశామని పేర్కొన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని, అలాగే మరో ఇద్దరు సరఫరాదారులపై కేసు నమోదు చేశామని తెలిపారు. రెండు బైకులు, రెండు మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్టు సీఐ ఎస్. కల్పన వెల్లడించారు. రూట్ వాచ్ లో ఎస్సైలు వెంకటేష్, వెంకటేశ్వర్లు, సిబ్బంది కొండలరావు, సంజయ్ కుమార్, దివాకర్ పాల్గొన్నారు.