టోక్యో ఒలంపిక్స్: ప్రీ క్వార్టర్స్‌లో పీవీ సింధు ఘన విజయం
దిశ, వెబ్‌డెస్క్: జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న 32వ ఒలంపిక్స్ పోటీల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు బిడ్డ వీపీ సింధు సత్తా చాటింది. ప్రీ క్వార్టర్స్‌లో ఘన విజయం సాధించింది. 21-15, 21-13 తేడాతో డెన్మార్క్‌కు చెందిన బ్లిచ్ ఫెల్డ్‌పై పైచేయి సాధించింది. కాగా, ఒలంపిక్స్‌లో గోల్డ్‌మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగిన పీవీ సింధు, లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్‌లో ఎదురులేకుండా దూసుకెళ్తోంది. వరుసగా రెండు విజయాలతో గ్రూప్‌లో అగ్రస్థానం సాధించి ప్రీ క్వార్టర్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్: జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న 32వ ఒలంపిక్స్ పోటీల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు బిడ్డ వీపీ సింధు సత్తా చాటింది. ప్రీ క్వార్టర్స్‌లో ఘన విజయం సాధించింది. 21-15, 21-13 తేడాతో డెన్మార్క్‌కు చెందిన బ్లిచ్ ఫెల్డ్‌పై పైచేయి సాధించింది.
కాగా, ఒలంపిక్స్‌లో గోల్డ్‌మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగిన పీవీ సింధు, లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్‌లో ఎదురులేకుండా దూసుకెళ్తోంది. వరుసగా రెండు విజయాలతో గ్రూప్‌లో అగ్రస్థానం సాధించి ప్రీ క్వార్టర్‌లో అడుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా.. ప్రీ క్వార్టర్‌లోనూ సింధు ఘన విజయం సాధించడంతో సహచర క్రీడాకారులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.