నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.. ఎందుకు జరుపుతారంటే?

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ జనాభా రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నది. ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా 800కోట్ల పైగానే జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తగినంత భూమి ఉండి మానవ వనరులు కూడా ఎక్కువగా ఉంటే, ఆ దేశం అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. చైనా అభివృద్ధికి ఇదే కారణం అని చెప్పొచ్చు. చైనాలో భూమి ఎక్కువగా ఉంది. అలానే జనాభా కూడా అత్యధికం. మానవ వనరులను ఆ దేశం సమర్ధవంతముగా వినియోగించుకుంటోంది. జనాభాపరంగా ఇండియా రెండో స్థానంలో ఉన్నది. […]

Update: 2020-07-11 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ జనాభా రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నది. ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా 800కోట్ల పైగానే జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తగినంత భూమి ఉండి మానవ వనరులు కూడా ఎక్కువగా ఉంటే, ఆ దేశం అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. చైనా అభివృద్ధికి ఇదే కారణం అని చెప్పొచ్చు. చైనాలో భూమి ఎక్కువగా ఉంది. అలానే జనాభా కూడా అత్యధికం. మానవ వనరులను ఆ దేశం సమర్ధవంతముగా వినియోగించుకుంటోంది.

జనాభాపరంగా ఇండియా రెండో స్థానంలో ఉన్నది. మన దేశంలో ప్రస్తుత జనాభాకు సరిపడినంతగా భూమి లేదు. అయినప్పటికీ కూడా ఇండియా మానవ వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. జపాన్ లాంటి దేశాల్లో పరిస్థితి మరో విధంగా ఉన్నది. అక్కడ భూమి చాలా తక్కవ. జనాభా అధికం. అయినప్పటికీ అవసరాలకు తగిన విధంగా టెక్నాలజీని రూపొందించి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. 1987 జులై 11వ తేదీన ప్రపంచ జనాభా 500 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. జులై 11 వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరపాలని ఐరాసలో ప్రతిపాదించారు. దీనిని ఐరాస 1989లో ఆమోదించింది. 1989 జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా గుర్తించింది.అప్పటి నుంచి ప్రతి ఏడాదీ జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుతుంటారు. ఇక 2010లో ప్రపంచ జనాభా 700కోట్లు ఉండగా, ప్రస్తుతం 800 కోట్ల పైగానే ఉన్నది. అయితే, 2050 నాటికి జనాభా సంఖ్య తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News