నేడు, రేపు భారీ వర్షాలు
దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఏపీ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు […]
దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఏపీ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.