నేడు కొండపోచమ్మ జలాశయం ప్రారంభం
దిశ, వెబ్ డెస్క్: కొండపోచమ్మ జలాశయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ ఆలయంలో చండీయాగం, మర్కూక్ పంపుహౌస్ వద్ద సుదర్శన హోమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉండనున్నారు. ఈ జలాశయం ద్వారా సిద్ధిపేట, మెదక్, మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది.