దేశవ్యాప్తంగా ఎన్ని కేసులంటే.?
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దాని ప్రభావినికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజుకు వేల సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 28,637 కొత్త కేసులు నమోదు కాగా, 551 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 8,49,553కు చేరింది. ఇందులో 5,34,621 మంది బాధితులు కరోనా బారిన పడి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2,92,258 మంది బాధితులు కరోనా […]
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దాని ప్రభావినికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజుకు వేల సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 28,637 కొత్త కేసులు నమోదు కాగా, 551 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 8,49,553కు చేరింది. ఇందులో 5,34,621 మంది బాధితులు కరోనా బారిన పడి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2,92,258 మంది బాధితులు కరోనా బారిన పడి ఇంకా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 22,674కు చేరింది.